కొన్నిరోజుల క్రితం రీరిలీజ్ ట్రెండ్ తెగ నడిచింది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు.
అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టాయి. ఇటీవలే దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అదే ‘పైయ్యా’ ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ శ్రోతలను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.ఆవారా చిత్రాన్ని ఇప్పుడు 4కే వెర్షన్ తో ఏప్రిల్ 11న తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారట. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తానని గతంలో డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు.🎥✨