అదిగో వంటలక్క, డాక్టర్ బాబు.. కార్తీక దీపం- 2 కొత్త ప్రోమో చూశారా..?✨🎞️
- Suresh D
- Feb 26, 2024
- 1 min read
మళ్ళీ నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ లే మెయిన్ క్యారెక్టర్స్ గా, పిల్లల్ని మాత్రం మార్చి సరికొత్తగా అదే టైటిల్ కార్తీక దీపం అంటూ రాబోతుంది. తాజాగా ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు.
ఈ జనరేషన్ లో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన సీరియల్స్‌లో కార్తీక దీపం మొదటి వరుసలో ఉంటుంది. ఐపీఎల్ ని మించి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని, దేశంలోనే ఎక్కువ టీఆర్పీతో అందరికి షాక్ ఇచ్చింది ఈ సీరియల్. కార్తీక దీపం సీరియల్ ఎంతలా ప్రేక్షకులకు చేరువైంది అంటే డాక్టర్ బాబు, వంటలక్కగా నటించిన నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ ఒరిజినల్ పేర్లు కూడా మర్చిపోయి ఆ పేర్లతోనే పిలిచేలా సక్సెస్ అయింది.
2017 అక్టోబర్ నుంచి 2022 జనవరి వరకు ఈ సీరియల్ సాగి ఎంతోమంది తెలుగు మహిళా ప్రేక్షకులని అలరించింది. ఈ సీరియల్ అయిపోయినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. దీంతో పిల్లలు పెద్ద అయిన క్యారెక్టర్స్ తో అసలు క్యారెక్టర్స్ డాక్టర్ బాబు, నిరుపమ్ లేకుండా సీరియల్ కొన్నాళ్ళు నడిపిస్తే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వకపోకడంతో సీరియల్ కి ఎండ్ కార్డు వేశారు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కి కూడా సీక్వెల్ వస్తుంది.
మళ్ళీ నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ లే మెయిన్ క్యారెక్టర్స్ గా, పిల్లల్ని మాత్రం మార్చి సరికొత్తగా అదే టైటిల్ కార్తీక దీపం అంటూ రాబోతుంది. తాజాగా ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో శౌర్య పాప నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని ఓ ఇంట్లో పనిమనిషిగా చూపించారు. నిరుపమ్ ని ఆ ఇంటి ఓనర్ గా చూపించారు. పాత కథనే కొన్ని మార్పులు చేసి తీస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ కార్తీక దీపం సీరియల్ టెలికాస్ట్ కానుంది. దీంతో తెలుగు మహిళా ప్రేక్షకులు ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ సారి కార్తీక దీపం ఏ రేంజ్ లో టీఆర్పీలు బద్దలు కొడుతుందో చూడాలి. మీరు కూడా కార్తిక దీపం ప్రోమో చూసేయండి.✨🎞️