top of page
Suresh D

🎭 కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్ - ఇక సెలవంటూ భావోద్వేగం 🤔

ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై హోస్ట్‌గా ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అమితాబ్ బచ్చన్. కానీ ఫైనల్‌గా ఆ షోకు ఆయన గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది. 🎤

సినిమాలు మాత్రమే కాదు.. బుల్లితెరపై వచ్చే సీరియల్స్, రియాలిటీ షోలు కూడా ప్రేక్షకుల మనసుకు దగ్గరవుతాయి. 📺 మామూలుగా బుల్లితెరపై అలరించే సీరియల్స్‌కు చాలానే పాపులారిటీ ఉంటుంది. దానికి సమానంగా కొన్ని షోలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఇస్తారు ప్రేక్షకులు. 🌟 అలాంటి వాటిలో ఒకటి ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు విజ్ఞాణాన్ని, వినోదాన్ని అందిస్తున్న ఈ షో.. ఆఖరి దశకు చేరుకుంది. 🎉 ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ అమితాబ్ బచ్చనే బయటపెట్టారు. ఈ షోలోని ఇదే లాస్ట్ ఎపిసోడ్‌ అంటూ ఎమోషనల్‌గా అందరికీ గుడ్ బై చెప్పారు అమితాబ్. 🤗 గ్రాండ్ ఫినాలేలో అమితాబ్ చెప్పిన మాటలు చాలామందిని కదిలించాయి. 🎤

‘‘అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను. రేపటి నుంచి ఈ స్టేజ్ ఒకేలా ఉండదు. మనం రేపటి నుంచి ఇక్కడ కలుసుకోము అని చెప్పడం చాలా కష్టంగా ఉంది, చెప్పడానికి మనసు రావడం లేదు. ఈ స్టేజ్‌పై నుంచి మీకు చివరిసారి చెప్పాలనుకుంటున్నాను. శుభరాత్రి’’ అంటూ ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోకు ముగింపు పలికారు అమితాబ్ బచ్చన్. 🌙 ఆ సమయంలో అక్కడే ఉన్న చాలామంది ప్రేక్షకులు.. ఆయన చెప్పిన మాటలు విని ఎమోషనల్ అయ్యారు. 🥺 ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ హోస్ట్‌గా వ్యవహరించిన అమితాబ్‌ను చాలామంది దేవుడిలాగా భావించేవారు. ఎంతోమంది ఆయన చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ గెలుచుకొని సంతోషంతో ఇంటికి వెళ్లారు. 💰

‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ ఇప్పటివరకు 15 సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. 2000 జులై 3న ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్‌లోని మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.అప్పటినుంచి ఇప్పటివరకు 15 సక్సెస్‌ఫుల్ సీజన్స్‌ను పూర్తి చేసుకొని పలువురిని కోటీశ్వరులని, చాలామందిని లక్షాధికారులను చేసింది కేబీసీ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ని అమితాబ్ లేకుండా ఊహించుకోలేమని ఈ 15 సీజన్స్‌ను కేవలం ఆయన హోస్టింగ్‌తోనే నడిపించారు మేకర్స్. వెండితెరపై నుంచి అమితాబ్.. బుల్లితెరకు రావడంతో మొదట్లో ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన లేని షోను ఊహించుకోలేకపోయారు. ఈ షో వల్ల బిగ్ బీకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

‘కేబీసీ ఫైనల్ ఎపిసోడ్‌లో అమితాబ్.. ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. నవ్వులు, ప్రేమలు, జ్ఞాపకాలతో కూడిన ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం’ అని సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇదే ఎండింగ్ కాదని.. దీని వల్ల కొత్త బిగినింగ్ కూడా ఉంటుందని సోనీ టీవీ హింట్ కూడా ఇచ్చింది. అమితాబ్ ఈ షోను వదిలి వెళ్లిపోయారంటే.. మరొక హీరో ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ తరువాతి సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తారా లేదా అమితాబ్ లేని షోను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఈ షోనే నిలిపివేస్తారా లాంటి వివరాలు తెలియాంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోలో ఇకపై అమితాబ్ లేకపోవడం బాధాకరం అని చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.🎉

bottom of page