ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేధార్ నాథ్. ఉత్తరాఖండ్‌లోని మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేధార్ నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కేధార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పుడు కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. శివయ్యను ఎప్పటి నుంచి దర్శనం చేసుకోవచ్చో తెలుసుకుందాం..ఈ ఆలయం మే అక్షయ తృతీయ నుంచి నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే తెరచి ఉంటుంది. భక్తుల దర్శనానికి అంటే ఆరు నెలలకు ఒకసారి తెరుచుకునే కేదార్‌నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు. 2024 సంవత్సరంలో, మే 10న ఉదయం 6:30 గంటలకు పవిత్ర మందిరం తలుపులు తెరవబడతాయి. ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది బోలేనాథ్ దర్శనం కోసం బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే 10 వ తేదీ 2024న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు. దీంతో కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.🕉️