top of page
MediaFx

కీర్తి సురేష్‌ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్


అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. వీటితో పాటు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఇక తెలుగు, తమిళ్లోనూ కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఎట్ ప్రజెంట్ రఘుతాత సినిమా ప్రమోషన్స్‌లో కాస్త బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. మెగాస్టార్ చిరు డ్యాన్స్‌ పై షాకింగ్ కామెంట్ చేసింది. మెగాస్టార్ చిరు డ్యాన్స్‌ కంటే.. విజయ్ దళపతి సూపర్ డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన కీర్తి సురేష్‌.. మెగాస్టార్ చిరు కంటే.. విజయ్ దళపతి బాగా డ్యాన్స్ చేస్తారంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ దళపతి డ్యాన్సింగ్ స్కిల్స్ సూపర్ అంది. అయితే కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఈ బ్యూటీ కామెంట్స్ పై నెట్టింట అసహనం వ్యక్తం చేస్తున్నారు.

bottom of page