top of page
Shiva YT

కేజ్రీవాల్‌కు పది రోజుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీ సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది.


bottom of page