top of page

కేర‌ళ చేరుకున్న ప్ర‌ధాని మోదీ.. వ‌య‌నాడ్‌లో ఏరియ‌ల్ స‌ర్వే

MediaFx

కేర‌ళ‌లోని క‌న్నురు విమానాశ్ర‌యానికి ప్ర‌ధాని మోదీ చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం విజ‌య‌న్‌తో పాటు గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ ఖాన్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌ధాని మోదీ మ‌రికాసేప‌ట్లో వ‌య‌నాడ్‌లో కొండ‌చ‌రియ‌ల వ‌ల్ల కొట్టుకుపోయిన ప్ర‌దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌య‌నాడ్‌లో తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల‌.. రిహాబ‌లిటేష‌న్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర స‌ర్కారు కోరింది. కొండ‌చ‌రియ‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో.. హెలికాప్ట‌ర్ ద్వారా ప్ర‌ధాని మోదీ ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉంటారు. తాజాగా జ‌రిగిన వ‌య‌నాడ్ విల‌యంలో సుమారు 226 మంది మ‌ర‌ణించారు. ఇంకా ఆచూకీ లేని వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న‌ది.

bottom of page