top of page
MediaFx

KGF యూనివర్స్‌లోకి స్టార్ హీరో అజిత్..

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కేజీఎఫ్ 2 తో కూడా రికార్డ్స్ ను కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత సలార్ మూవీతోనూ ఇదే రిపీట్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మరో క్రేజీ హీరోతో ఓ సినిమా చేయబోతున్నారట. సినిమా చేయడమే కాదు.. ఆ సినిమాను కేజీఎఫ్ స్టోరీతో లింక్ చూడా చేయబోతున్నారట. ఇక అసలు విషయం ఏంటంటే..! కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు చేయబోతున్నారట. ఇందులో ఒక సినిమా పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని కోలీవుడ్‌ టాక్. అలాగే మరొక సినిమా రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ యూనివర్స్ కు లింక్ చేస్తుందని ఇన్‌సైడ్ న్యూస్. అంటే కేజీఎఫ్ 3 కంటే ముందే అజిత్, నీల్ సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అజిత్ నటించే సినిమా నుంచే కేజీఎఫ్ 3 కి లీడ్ తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్, అజిత్ కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2026లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

bottom of page