కేజీయఫ్ చాప్టర్ 1 తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించి, రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో యాభై కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేజీయఫ్ చాప్టర్ 2 కూడా అంతే హిట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేజీయఫ్ చాప్టర్ 1ని మళ్లీ విడుదల చేస్తున్నారు. 🎬
అయితే అన్ని రీ రిలీజ్‌లు విజయం సాధించడం లేదు. పాత సినిమాల మీద మోజు పెరుగుతున్నా, పక్కా ప్లానింగ్ లేకుండా సడెన్‌గా విడుదల చేసే సినిమాలు ప్రేక్షకులను రప్పించడంలో విఫలమవుతున్నాయి. పోకిరి, ఒక్కడు, జల్సా, తొలిప్రేమ, ఖుషి, ఆరెంజ్ వంటి కొన్ని సినిమాలు మాత్రమే రీ రిలీజ్‌లోనూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో గిల్లీను రీ రిలీజ్ చేస్తే ఏకంగా యాభై కోట్ల గ్రాస్ వచ్చింది. 🗓️
ప్రచారం చేయకుండా సడెన్‌గా పోస్టర్లు విడుదల చేసి రేపు సినిమాను వదులుతున్నామంటే చూసేవాళ్లు ఎవరుంటారు. అసలు ఈ కేజీయఫ్ రీ రిలీజ్‌కి ఒక్క థియేటర్ అయినా హౌజ్ ఫుల్ అవుద్దా? ప్రేక్షకులతో నిండుద్దా అన్నది చూడాలి. 🎟️