ఓ మోస్తరు నుంచి భారీ సినిమాలు ఏవి సెట్స్ మీదకు వెళ్తున్నా... ముందుగా అభిమానులు అడిగే మాట హీరోయిన్ ఎవరూ... అని! ఆ మధ్య ఏ సినిమా స్టార్ట్ అవుతుందన్నా హీరోయిన్‌గా కియారా పేరు వినిపించేది. ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో ఆ చప్పుడు కాస్త తగ్గింది. లేటెస్ట్ గా మళ్లీ అదే హవా కనిపిస్తోంది. ఎక్కడ విన్నా.. కియారా పేరే..!
ఉ అంటావా మావా అంటూ పుష్ప సినిమాలో బంపర్‌గా క్లిక్ అయింది సమంత చేసిన స్పెషల్ సాంగ్. దాన్ని తలదన్నే సాంగ్‌ని సీక్వెల్‌లో సెట్ చేయాలన్నది మేకర్స్ ఐడియా. అందుకే కియారాను అప్రోచ్ అయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ప్లేస్‌లో జాన్వీని ఆల్రెడీ ఫిక్స్ చేశారన్నది ఇన్‌సైడ్ సోర్స్.
పుష్ప లేకపోతేనేం... విజయ్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్... గోట్‌లో స్పెషల్ సాంగ్‌కి కియారాను అప్రోచ్ అయ్యారనే మాటలు ఎలాగూ ఉన్నాయి. దానికి తోడు తారక్ - నీల్ సినిమాలో హీరోయిన్‌గానూ క్యూట్ కియారానే ఫైనల్ చేశారన్నది టాక్.
నార్త్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు హృతిక్ - తారక్ వార్2కి కూడా కమిట్ అయ్యారు ఈ బ్యూటీ. ఇప్పుడు సౌత్‌లో గేమ్ చేంజర్ ఎలాగూ సెట్స్ మీదుంది. రాకీ భాయ్ యష్ టాక్సిక్‌లోనూ కియారా నాయిక.
చూడటానికి సౌత్ గర్ల్ గా కనిపించడమే ఆమెకు ప్లస్ పాయింట్ అంటున్నారు క్రిటిక్స్. కమర్షియల్ సినిమా హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉండటంతో కియారాకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయన్నది వారి మాట.