ప్రజెంట్ నార్త్ స్టార్స్ అంతా సౌత్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ మన హీరోలతో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే టాలీవుడ్‌తో టచ్‌లో ఉండాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నారు.
ఈ ఈక్వెషన్‌ను డీకోడ్ చేసిన ఇద్దరు బ్యూటీస్.. ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్.
ఈ బ్యూటీ తెరంగేట్రం చేసిన దగ్గర నుంచే సౌత్ ఎంట్రీ విషయంలో చర్చ జరుగుతోంది. లాంగ్ వెయిటింగ్ తరువాత టాలీవుడ్లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ కపూర్.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవరతో పాటు, రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందబోతున్న పాన్ ఇండియా మూవీలోనూ జాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో సౌత్‌లోనూ సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు జూనియర్ శ్రీదేవి.
ఆల్రెడీ సౌత్ సినిమాతో టచ్‌లోనే ఉన్న కియారా కూడా దక్షిణాది మీద ఫోకస్ పెంచారు. ప్రజెంట్ రామ్ చరణ్‌తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, నెక్ట్స్ వార్ 2లో ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. మరి ఈ ఇద్దరు అందాల భామలకు ట్రిపులార్ హీరోల సినిమాలు ఎంత వరకు హెల్ప్ అవుతాయో చూడాలి.