top of page
MediaFx

ట్రంప్‌పై హత్యాయత్నం.. సీన్‌ రీక్రియేట్‌ చేసిన పిల్లలు!


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఆయన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పలు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్‌పై కాల్పులు జరిగిన వీడియోలను చూసిన ఉగాండాకు చెందిన కొందరు చిన్నారులు సీన్ రీక్రియేట్‌ చేశారు. చెక్క తుపాకులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, కర్ర బొమ్మలు ఉపయోగించి ఆ రోజున ఏం జరిగిందో అచ్చం అదేమాదిరి నటించడమేకాదు.. ఏకంగా జీవించేశారు. ఇందుకు సంబంధించిన టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టిక్‌ టాక్‌ వీడియోలో.. ఏడేళ్ల పిల్లవాడు ట్రంప్‌ మాదిరి నటించాడు. కాల్పుల సమయంలో ట్రంప్‌ ముఖకవలికలు, బుల్లెట్‌ తగలగానే ఆయన కిందకు వంగడం, సీక్రెట్ సర్వీస్‌ సిబ్బంది వెంటనే ఆయనను చుట్టుముట్టడం నుంచి హత్యాప్రయత్నం విఫలమైన తర్వాత ట్రంప్‌ ఐకానిక్ సంజ్ఞతో సహా ఈవెంట్‌లోని ప్రతి భాగాన్ని పిల్లలు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో చూపించారు. ఈ వీడియోలో పిల్లలు చెక్కతో చేసిన బొమ్మ తుపాకులు పట్టుకొని స్టేజ్‌లాంటి స్థలంలో నిలబడగా.. వారి మధ్యలో ఓ పిల్లవాడు మైక్‌ ముందు నిల్చొని మాట్లాడుతుండటం కనిపిస్తుంది. వెంటనే కాల్పుల శబ్దం వినబడగానే.. చుట్టూ ఉన్న మిగతా పిల్లలు సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది మాదిరిగా ట్రంప్‌ పాత్రలో నటించిన పిల్లవాడిని అక్కడి నుంచి భద్రంగా తీసుకెళ్తుంటారు. కాల్పుల సమయంలో వేదిక పైనుంచి దిగుతూ ట్రంప్‌ పిడికిలి బిగించి ‘ఫైట్‌’ నానాదం చేశాడు. ఇక ట్రంప్‌ పాత్రలో ఉన్న పిల్లవాడు కూడా ఇదేమాదిరి పిడికిలి బిగించి నినాదం చేయడం వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సీన్‌ రీక్రియేషన్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సంఘటనలు పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పలువరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కార్యక్రమంలో ఉన్న ఓ ప్రేక్షకుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. హత్యాయత్నం జరిగిన సమయంలో ట్రంప్‌ తలకి పాయింట్‌ బ్లాంక్‌లో షాట్‌కు పన్నాగం పన్నారు. కానీ సరిగ్గా అదే సమయానికి ట్రంప్ తల వంచకుంటే నేరుగా బుల్లెట్‌ ఆయన తలలో నుంచి దూసుకుపోయేది. బుల్లెట్‌ ట్రంప్‌ చెవిని చీల్చుకుంటూ వెల్లడంతో ప్రమాదం తప్పింది. అయితే నెటిజన్లు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో అక్కడ ఉన్న సెక్యురిటీ సిబ్బంది వెంటనే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చేసిన ఈ వీడియోలో సెక్యురిటీ మెరుగ్గా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

bottom of page