కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు..
- MediaFx
- Jul 24, 2024
- 1 min read
తాజాగా కిరాక్ ఆర్పీ పై నటుడు, కమెడియన్ షేకింగ్ శేషు మండిపడ్డారు. అతను ఒక ఫ్రాడ్ అంటూ, ఓ నిర్మాతను నిండా ముంచాడు అని ఫైర్ అయ్యారు శేషు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో ఆర్పీ ఓ సినిమా తీస్తున్నా అంటూ హడావిడి చేశాడు. ఓ నిర్మాతను పట్టుకున్నాడు. ఆయన ఇక్కడ ఉండడు. జేడీ చక్రవర్తితో సినిమాను ఓపెన్ చేయించాడు. ఆ ఓపినింగ్ కు నాగబాబు కూడా వచ్చారు. పెద్ద సినిమాతీస్తున్నాడు అని మేము కూడా ఆనందపడ్డాం. కానీ హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ఒకటి రెంట్ కు తీసుకున్నాడు. దాని రెంట్ రూ.50 వేలు. సినిమానే మొదలు కాలేదు. అప్పుడే నిర్మాత చేత భారీగా ఖర్చు పెట్టించడం మొదలు పెట్టాడు. తీరా చూస్తే సినిమా మొదలవక ముందే రూ.20 లక్షల బిల్లు నిర్మాత చేతిలో పెట్టాడు. దాంతో ఆతను లబోదిమోమన్నాడు. “నన్ను నిండా ముంచావ్.. నువ్వొద్దు నీ సినిమా వద్దు.. సినిమా మొదలు పెట్టకుండానే 20 లక్షలు ఖర్చుపెట్టావు. నా డబ్బులు రిటన్ ఇచ్చేయ్” అంటూ గగ్గోలు పెట్టాడు. ఆతర్వాత హోమ్ టూర్ పెద్ద ఫ్రాడ్. ఎవరిదో ఓ ఇంటిని చూపించి ఇది నా ఇల్లు దీని ఖరీదు మూడు కోట్లు.. ఇది నా బెడ్ రూమ్ అంటూ బడాయి చూపించాడు. నిజానికి అది వాడి ఇల్లు కాదు. ఎవరో కోటీశ్వరుడి ఇల్లు. ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటే ఆ ఇల్లు చూపించి నాది అంటూ వ్యూస్ కోసం ఓ ఫ్రాడ్ చేశాడు అంటూ ఆర్పీ బండారాలు బయట పెట్టారు శేషు.