top of page
MediaFx

వీళ్లకు ఇదేం సరదా .. షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్.. బ్లేజర్ తీసిన అనసూయ..?


స్టార్ మా ఛానల్‌లో నిన్న ఆదివారంతో ‘నీతోనే డాన్స్ 2.0 ముగుస్తుంది. 13 వారాల పాటు సాగిన నీతోనే డాన్స్‌లో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో విజేతను ప్రకటించనున్నారు. అయితే ఫినాలే ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో.. విజేత ఎవరనే విషయం బయటకు వచ్చేసింది. అమర్ దీప్-తేజూలు విన్నర్స్ అయ్యారనేది లేటెస్ట్ టాక్. అయితే సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుండగా.. అప్పటి వరకూ స్టార్ మా ఛానల్‌లో మరో గేమ్ షో ప్రారంభం కాబోతుంది.


కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ (Kiraak Boys Khiladi Girls) అంటూ సాగే ఈ గేమ్ షో.. జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. పేరుకి తగ్గట్టే ఖిలాడీ భామల్ని రంగంలోకి దించారు. అయితే ఖతర్నాక్ ఖిలాడీ అయిన అనసూయ.. ఈ ఖిలాడీ భామలకు లీడర్ కాగా.. కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీంకి రూ.20 లక్షల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. 

ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ చేస్తూ కనిపించింది అనసూయ. అయితే అనసూయ గెటప్ అయితే మామూలుగా లేదు. ఈ షోకి కూడా శ్రీముఖినే యాంకర్‌గా కంటిన్యూ చేయిస్తోంది స్టార్ మా.


ఇక రెండు టీమ్స్‌లోనూ ఆ బిగ్ బాస్ అగ్రిమెంట్‌‌లో ఉన్న వాళ్లే ఉన్నారు. ఎలాగూ రెండుమూడేళ్లు బిగ్ బాస్ షోలోనే చేయాలని అగ్రిమెంట్ ఉండటంతో.. ఆ సీజన్ 8 చిరాకు తెప్పించిన వాళ్లనే ఇక్కడికి కూడా కంటెస్టెంట్స్‌గా తీసుకుని వచ్చారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని తీసుకుని రాకపోవడం. అతనొస్తే ఇక్కడ కూడా రైతు సింపథీ డ్రామాలతో రూ.20 లక్షల్ని ఎగరేసుకుని పోయినా పోయేవాడేమో కానీ.. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అమర్ దీప్, అర్జున్ అంబటి, టేస్టీ తేజాలను తీసుకొచ్చారు. ఇక అమ్మాయిల్లో.. కన్నడ కంత్రీలు, బిగ్ బాస్ సీజన్ 8 ఖతర్నాక్‌లు శోభాశెట్టి, ప్రియాంక జైన్‌లను దింపారు.


మధ్యలో మధ్యలో ముద్దులు.. రొమాన్స్‌లతో ఇది గేమ్ షోలను మించిన షోనే అనేట్టుగా ఉంది. అయితే ఆఖర్లో ఏం టాస్క్ ఇచ్చారో ఏమో కానీ.. అటు శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పుతుంటే.. ఇటు విప్పడంలో దిట్ట అయిన అనసూయ తన టాప్‌ని విప్పుతూ సై సై అంటోంది.


వీళ్లిద్దరూ పోటీపడి విప్పుతుంటే.. పక్కనుంచి శ్రీముఖి అరుపులు.. కంటెస్టెంట్స్ గోలలు.. వామ్మో ఇది గేమ్ షోలలో నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంది. అటు అనసూయ.. ఇటు శ్రీముఖి.. శేఖర్ మాస్టర్.. అమర్ దీప్.. ప్రియాంక జైన్.. శోభా శెట్టి.. అబ్బో అంతా రచ్చ బ్యాచే ఉన్నారు. మరి ఈ గేమ్ షో ఇంకెంత రచ్చ రేపుతోందో చూడాలి మరి. అయితే ప్రోమోతోనే హీట్ పెంచేయడంతో.. ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లోనే కాకుండా..వెండితెర వర్గాల్లోనూ ఈ ప్రోమోపై హాట్ టాపిక్ నడుస్తోంది.



bottom of page