చాలా సార్లు, శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యత కోల్పోతుంది. ఒత్తిడి పెరిగినా, ఆహారంలో మార్పు వచ్చినా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. పీసీఓడీ, థైరాయిడ్, ఫ్రైబోయిడ్ సమస్యల కారణంగా కూడా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. మీరూ ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు అల్లం చక్కగా పనిచేస్తుంది. అల్లం తినడం వల్ల రుతుచక్రం సాధారణం అవుతుంది. అలాగే పీరియడ్స్ క్రాంప్స్, అధిక రక్తస్రావం, వికారం, అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు PCODతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో దాల్చిన చెక్కను ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ మసాలా దినుసు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క క్రమంతప్పకుండా తినడం వల్ల పీరియడ్స్ సమస్య క్రమంగా తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవల్స్, హార్మోన్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగినా ఫలితం ఉంటుంది. చాలా మంది బరువు తగ్గేందుకు జీలకర్ర నీరు తాగుతుంటారు. పీరియడ్స్ సమస్యల నివారణకు కూడా జీలకర్ర నీటిని తాగవచ్చు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల రుతుక్రమం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి.