top of page

నడీ సముద్రంలో బోటుకు రంధ్రం..ఎలా బయటపడ్డారో తెలుసా ??


మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. మొండిగా సముద్రంలోనికి వెళ్ళి మత్స్యకారులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు ప్రమాదం తప్పింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-V5-MM-245 బోటులో మత్స్యకారులు చేపల వేట కోసం పూడిమడక వైపు వెళ్లారు. సముద్రంలో చేపల వేట సమయంలో బోటుకు రంధ్రం పడింది. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల తాకిడి పెరగడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏడుగురు మత్స్యకారులు బోటు నుంచి సముద్రంలోకి దూకేశారు. మునిగిపోతున్న బోటును ఒడ్డుకు తెస్తున్న క్రమంలో పాపికొండ తీరంలో బోటు ధ్వంసమైంది. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

 
 

Related Posts

See All
bottom of page