వన్డే ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టడమంటే.. గిల్‌కు చాలా ఇష్టం. అదే అతడిని టీమ్ ఇండియా యువరాజుగా నిలబెట్టింది. 1988లో వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టారు.
అప్పటి నుంచి ప్రపంచ నెంబర్ వన్ వన్డే ఆటగాడిగా కేవలం నలుగురంటే నలుగురే టీమ్ ఇండియా నుంచి నిలిచారు. వారిలో మొదటి ముగ్గురు సచిన్, ధోనీ, కోహ్లీ. మిగిలిన ఆ నాలుగోవాడే … శుభ్‌మన్ గిల్. సచిన్, ధోనీ ఆటకు బైబై చెప్పేశారు. కోహ్లీకేమో 35 ఏళ్లు వచ్చేశాయి. అందుకే నవ యవ్వనంతో.. సొగసైన ఆటతీరుతో దూసుకుపోతున్న గిల్ వైపే అందరి చూపు ఉంది. ఇదే మనవాడిని గూగుల్‌లో హీరోను చేసింది.
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ పెర్ఫార్మెన్స్. అది కూడా తెలుగు గడ్డపై ఉప్పల్ స్టేడియంలో ఆడిన ఆ ఆట చూడాలి.. వారెవ్వా అనకుండా ఉండలేరు. కివీస్‌పై బాదిన డబుల్ సెంచరీని చూసి. అరే ఏం ఆడుతున్నాడ్రా అని అందరూ ఒకటే చప్పట్లు. పైగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డ్ కూడా కొట్టాడు. గిల్‌కు ఓ మైనస్ ఉంది. సెంచరీలు చేసి వెంటనే పెవిలియన్ బాట పడతాడు. కానీ ఇది ఆయన ఫాదర్ లఖ్విందర్ సింగ్‌ను బాగా బాధపెట్టేది. అందుకే కొడుకుతో ఖరాఖండీగా చెప్పేశాడు. ఆడి గెలవడమే కాదు.. ఆడి నిలవాలి కూడా అని. తండ్రి చెబితే ఏ కొడుకైనా ఎలా కాదంటాడు! అందుకే న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేసి.. క్రీజ్‌లో లాంగ్ టైమ్ ఉండగలను.. స్కోర్ బోర్డ్‌ను ఉరకలెత్తించగలను అని చాటిచెప్పాడు. 🏏🌟