🎶 ‘జిగర్తాండ డబుల్ X’ మూవీ నుండి ‘కోర మీసం’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది🎶
- Suresh D
- Oct 13, 2023
- 1 min read
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీపావళికి రిలీజ్ కాబోతుంది. వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘కోరమీసం’ అనే పాటను హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు.