top of page
Shiva YT

దేవర కోసం ఆ డేంజరస్ ఫార్ములా అప్లై చేస్తున్న కొరటాల 🎬🎥

పాన్ ఇండియన్ సినిమాలకు రాజమౌళి రూట్ మ్యాప్ సిద్ధం చేసాక.. హాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు మన దర్శకులు. కొరటాల శివ సైతం ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఎంచక్కా బాహుబలి ఫార్ములానే దించేస్తున్నారు ఈయన. తన స్టైల్‌లో దేవర ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మరి కొరటాల ఏ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్నారో తెలుసా..? 🤔

తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలన్నా.. రాజమౌళి మధ్యలో వచ్చేస్తున్నారు. తన గురించి మాట్లాడకుండా భారీ బడ్జెట్ మూవీస్ గురించి టాపిక్కే లేకుండా చేసారీయన. తాజాగా దేవర కోసం కొరటాల శివ కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారీయన. పెరిగిన బడ్జెట్‌ను రికవరీ చేసుకోడానికి ఇదో మంచి మార్గమే. 💰

అక్టోబర్ 10న రిలీజ్ డేట్ ఉండటంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవర షూటింగ్ వేగంగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. బాహుబలిలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలి పాత్రల్ని రాజమౌళి క్రియేట్ చేసినట్లుగానే.. దేవరలోనూ రెండు పాత్రలను సమాంతరంగా చూపించబోతున్నారు కొరటాల శివ. 🌟

బాహుబలి ది బిగినింగ్ ఫస్టాఫ్‌లో కొడుకు పాత్ర ఉంటే.. సెకండాఫ్ అంతా తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే కంక్లూజన్ ఫస్టాఫ్‌లో తండ్రి పాత్ర ముగింపు.. సెకండాఫ్‌లో కొడుకు పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. దేవరలోనూ ఇదే ఫార్మాట్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దేవర 1లో కొడుకు.. సీక్వెల్‌లో తండ్రి పాత్రలు హైలైట్ కానున్నట్లు తెలుస్తుంది. 🔥

తండ్రీ కొడుకుల పాత్రలన్ని ఒకదాన్ని మించి మరోటి ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఎలివేషన్స్ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటున్నారీయన. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం దేవరకు మరో మేజర్ ప్లస్. ఎన్టీఆర్ కూడా దేవర కోసం ప్రాణం పెడుతున్నారు. మొత్తానికి బాహుబలి ఫార్ములా ఈ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 🎬🌟🎥💰🔥

bottom of page