top of page
MediaFx

కుమారీ ఆంటీని కలిసిన సోనూ సూద్.. ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ


ఇనార్బిట్ ITC కోహినూర్ హోటల్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల దగ్గర సడన్ గా ఒక ఆడి కారు ఆగింది. అందులోంచి దిగిన నటుడు సోనూసూద్.. ఆయన రోడ్డు పక్కడ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీని కలిసి సడన్ సర్ప్రైజ్‌ ఇచ్చారు. నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు.ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్‌లో ఎలాంటి సహాయం అవసరమైనా.. చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఓ సెలబ్రిటీ అయ్యారు. మొన్నటివరకు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించింది. తాజాగా సోనూ సూద్ కుమారి ఆంటీని కలవడంతో ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది.

bottom of page