top of page
Shiva YT

🔴 కుప్పం నాదే.. భువనేశ్వరి వ్యాఖ్యల తర్వాత పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన..

🕰️ సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో అధికార పార్టీ వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు దాదాపు అన్ని స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి కూడా మరో ముందడుగు వేసింది.


ఏపీలో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయబోతోంది. ఈ క్రమంలో.. 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కుప్పంలో నారా భువనేశ్వరినా.. లేక చంద్రబాబు నాయుడా.. పోటీ చేసేది ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. కుప్పం నుంచి తానే పోటీ చేయనున్నట్లు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించుకున్నారు. దీంతో కుప్పం బరిలో ఉండేదెవరో.. తేలిపోయింది. దీనంతటికి ప్రధాన కారణం.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు బదులు తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పర్యటించిన భువనేశ్వరి.. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని.. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.

🤔 దీంతో కుప్పం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. నారా భువనేశ్వరి కుప్పంలో పోటీచేస్తే.. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఏ నియోజవర్గం అయితే బాగుంటుంది.. అనే ఊహగానాలు మొదలయ్యాయి.. ఈ క్రమంలోనే వాటన్నింటికి చెక్ పెడుతూ.. చంద్రబాబు తానే పోటీచేస్తున్నట్లు చెప్పడంతో.. కుప్పం అభ్యర్థి ఎవరన్నది క్లారిటీ వచ్చింది.

📅 అయితే, మూడున్నర దశాబ్దాల నుంచి కుప్పం నియోజవర్గం చంద్రబాబు ఇలాఖాగా ఉంది.. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. 1989 నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తూ.. టీడీపీ జెండా ఎగురవేస్తున్నారు. అక్కడ ఆయన ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. 🗳️

bottom of page