ఖుషి మూవీ టికెట్స్ బుకింగ్ పై మేకర్స్ అప్ డేట్..🌟🎞️
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఖుషి.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం అయిన ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించారు.ఈ మూవీ యొక్క థియేటర్ టికెట్ బుకింగ్ ని ఆగష్టు 30న ఉదయం 10 గం. ల నుండి ప్రారంభించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికే టికెట్స్ కోసం పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు యుఎస్ఏ లో ఖుషి ప్రీమియర్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.మరి మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఖుషి ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.🌟🎞️