జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. 2024లో ఆయన నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు విడుదలయ్యాయి. గామి మూవీలో విశ్వక్ అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్ర చేశారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో సాగుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించింది. జులై 3 బుధవారం హైదరాబాద్ లో కొత్త మూవీ లాంచ్ చేశాడు విశ్వక్ సేన్. లైలా ఈ చిత్రం టైటిల్. లైలా మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ లతో పాటు దర్శక నిర్మాతలు, యూనిట్ సభ్యులు, టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. లాంచింగ్ డే రోజే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే లేడీ గెటప్స్ ట్రై చేశారు. కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, నరేష్... ఈ లేడీ గెటప్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ ఛాలెంజ్ తాజాగా విశ్వక్ సేన్ తీసుకున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. విశ్వక్ సేన్ పాత్రపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీ 2025 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది.