top of page
MediaFx

ఘనంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు..


200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు తెలంగాణాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం అమ్మవారు బోనాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉజ్జయినీ మహాకాళి దర్శనానికి తరలివచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కళకళలాడుతున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో.. లష్కర్‌ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు.

భాగ్యనగరంలో ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

bottom of page