top of page
MediaFx

లేటు వయసులో మాస్‌ మహరాజ్‌ రొమాన్స్‌


సీనియర్ హీరోలంతా స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్స్ చేయటం మానేశారు. కోలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా తాత పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సిచ్యుయేషన్‌లోనూ ఓ సీనియర్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్నారు. సినిమాల సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాలో కాస్త బోల్డ్ సాంగ్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో మిస్టర్ బచ్చన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాలో రొమాంటిక్ సీన్స్‌కు కూడా స్కోప్ ఇచ్చారు మేకర్స్‌.

లేటెస్ట్ టీజర్‌లో అదే విషయాన్ని రివీల్ చేశారు. ఈ వయసులో రవితేజ ఇలాంటి సీన్స్‌ చేయటం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ జరుగుతోంది. మాస్ మహరాజ్ ప్రీవియస్ మూవీస్‌లోనూ ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి.

మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రొమాంటిక్ నెంబర్‌ ఉండేలా చూసుకున్నారు రవితేజ. ఈ సాంగ్‌లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన రేంజ్‌లో హీరోయిన్‌ను గ్లామరస్‌గా ప్రెజెంట్ చేశారు. అయితే ఈ సాంగ్‌ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

మిగతా హీరోలు వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తుంటే రవితేజ మాత్రం ఇంకా మాస్‌ ఫార్ములా సినిమాలకే ఫిక్స్ అవ్వటం, కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్ల పాడటం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు మాస్ మహరాజ్‌ సక్సెస్‌తో చెక్‌ పెడతారేమో చూడాలి.

bottom of page