తాజా ఇంటర్వ్యూ...టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. ఎన్నో సినిమాల్లో హీరోగా అలరించి.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు.
చాలా కాలం పాటు ఇండస్ట్రీలో దూరంగా ఉన్న జగపతి బాబు.. ఆ తర్వాత లెజెండ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించారు. ఇక ఆ తర్వాత పూర్తిస్థాయి విలన్ గా మారిపోయారు. విలన్ గానే కాకుండా సహాయ నటుడిగానూ కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రలో కనిపించారు. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన కాటేరా చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు అని చెప్పుకోచ్చారు.