top of page
MediaFx

ఈ పాత్ర నాకన్నా ఎవ్వరూ బాగా చేయలేరు..

విజయ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ నటిస్తుంది. ఈ సినిమాతో మృణాల్ హ్యాట్రిక్ సాదించబోతుంది. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.ఒక ఇంటర్వ్యూ లో మృణాల్ మాట్లాడుతూ..

నన్ను ఇంతగా ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.. నన్ను మీరందరూ మీ తెలుగమ్మాయిగా ఆదరించారు. కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపైన చూపిస్తున్నారు. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.. అని ఎమోషనల్ అయ్యింది మృణాల్. అలాగే ఈ సినిమాలో ఇందు అనే పాత్రలో నటిస్తున్నా.. మొదటి 15 రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవ్వరూ బాగా చేయలేరు అని అనిపించింది. విజయ్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో నాకు ఆ అవకాశం దక్కింది అని తెలిపింది మృణాల్. ఈ సినిమా తర్వాత మృణాల్ కు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

bottom of page