🛍️ మార్కెట్ అనేక రకాలైన కాస్మోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఖరీదై కెమికల్స్ ఆధారిత కాస్మోటిక్స్ వాడుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి… చాలా రసాయనాలు కలిగి ఉన్న మార్కెట్ కాస్మోటిక్స్ మీ చర్మాన్ని కాసేపు మెరిసేలా చేయవచ్చు, కానీ, తరువాత మీ చర్మానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
ఆ సందర్భంగా నైట్ స్కీన్ కేర్ రోటిన్ లో భాగంగా.. మన కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం, ఉపయోగించడం సులభం. దీన్ని సిద్ధం చేసుకోవడానికి కావలసిందల్లా కొద్దిగా పసుపు మరియు పాలు…!! 🌿🌼
పసుపు: రోజంతా దుమ్ము మరియు ధూళికి గురికావడం వల్ల మీ చర్మం చాలా మురికిగా మారుతుంది. పసుపు మన ముఖంలోని మురికిని శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది. ముఖాన్ని తక్షణమే కాంతివంతంగా మార్చేందుకు పసుపు సహాయపడుతుంది. అందుకే పెళ్లికి ముందు వధువుకు పసుపు రాస్తారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మచ్చలను తొలగించడంలో మరియు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే పసుపును మీ ముఖంపై 10 లేదా 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త వహించండి. మీకు ఏవైనా చర్మ సమస్యలు ఎదురైతే వెంటనే ప్యాక్‌ని కడిగేయండి. 💆♀️
పచ్చి పాలు: పచ్చి పాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. మచ్చలను తగ్గిస్తుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే మొటిమలకు కూడా పచ్చి పాలు చక్కటి పరిష్కారం అవుతుంది. పచ్చిపాలతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. మీకు కావలసిన పదార్థాలు.. 🍶🍃