🔍 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చదవడంతో తన రోజువారీ దినచర్యను ప్రారంభిస్తారు. అయితే ఆయన ఉదయమే చదివేది ఏ న్యూస్ పేపరో లేక పుస్తకమో కాదు.
టెక్ మీమ్ అనే వెబ్ సైట్ ను ఆయన ఉదయమే ఓపెన్ చేస్తారట. అందులో ఉన్న అప్ డేట్స్ ను ఆయన క్రమం తప్పకుండా చదువుతారట. ఈ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే వారిలో మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకెర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితర టెక్ దిగ్గజాలు కూడా ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ కూడా వీరి జాబితాలో చేరారు. ప్రపంచంలోని లేటెస్ట్ గ్లోబల్ టెక్ వార్తలను టెక్ మీమ్ అందిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. టెక్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక మంచి వెబ్ సైట్ అని చెప్పొచ్చు. అయితే వెబ్ సెర్చ్ విధానం రోజు రోజుకూ మారిపోతోందని సుందర్ పిచాయ్ చెప్పారు. 🔍 భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం తాము జెమినీ అనే ఏఐ చాట్ బాట్ ను తీసుకొస్తున్నామని తెలిపారు. 💬