📱 **ఐకూ చెబుతున్న దాని కొత్త స్మార్ట్ ఫోన్ నియో 9 ప్రో ఫ్లాగ్‌షిప్-స్థాయి అద్భుతమైన పనితీరు, సున్నితమైన నైపుణ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తుందని కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ తో పాటు ఐకూ.కామ్ లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అలా ప్రీ బుక్ చేసుకుంటే రూ. 1000 వరకూ అదనపు తగ్గింపుతో పాటు రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. అలాగే లాంచింగ్ రోజున మరిన్ని ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో తేదీన ఇది గ్రాండ్ గా లాంచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
📱 ఇవి గుర్తుంచుకోండి.. 📱 **ఐకూ నియో 9 ప్రో ప్రీ బుకింగ్స్ అమెజాన్ తో పాటు ఐకూ.కామ్ లో ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ ప్రీ-బుకింగ్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఉంటుంది. మొదట బుక్ చేసుకున్న వారికి మొదటి సర్వ్ ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు రూ. 1000 మొదటి చెల్లిస్తే..తర్వాత అది రీఫండ్ అవుతుంది.
📱 ఐకూ నియో 9 ప్రో ఫీచర్లు.. 📱 **ఈ స్మార్ట్ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 1.7 మిలియన్లకు పైగా ఉంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.
📱 గేమింగ్ ఇది బాగా నప్పుతుంది. ఐకూ సొంత సూపర్‌కంప్యూటింగ్ చిప్ క్యూ1తో అసమానమైన గేమింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. 144ఎఫ్పీఎస్ గేమింగ్, 900-పిక్సెల్ వరకు సూపర్ రిజల్యూషన్‌ను అందజేస్తుంది. ఇది సున్నితమైన, లీనమయ్యే గేమింగ్ సెషన్‌ను నిర్ధారిస్తుంది. 🎮✨