top of page
Shiva YT

📱🌟 హానర్‌ నుంచి మరో 5జీ ఫోన్‌.. సరికొత్త ఇయర్‌ఫోన్స్‌, వాచ్‌తో పాటు ఒకేసారి మార్కెట్లోకి..🌟📱

ఫిబ్రవరి 6న ఓ పత్రికా ప్రకటనను హానర్‌ విడుదల చేసింది. హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లభ్యతకు సంబంధించిన వివరాలను దానిలో వెల్లడించింది. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 5,800ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌తో 18 గంటల కాలింగ్ సమయం, గరిష్టంగా 12 గంటల గేమింగ్ సమయం, 19 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని సింగిల్‌ ఛార్జ్‌పై అందిస్తుందని పేర్కొంది. లేదా మూడు రోజులపాటు నిరంతరాయ ఉపయోగించే అవకాశం ఉందని వివరించింది. ఇది 1,000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా దాని సామర్థ్యంలో 80 శాతం నిలుపుకుంటుంది. దీనికి గోల్డ్ బ్యాటరీ లేబుల్‌ను ఇచ్చింది.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 7.2 ఆధారంగా పనిచేస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌లను అందిస్తోంది. ఇది క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 ఎస్‌ఓసీ పాటు 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఆన్‌బోర్డ్ మెమరీని 20జీబీ వరకు పెంచుకోవచ్చు.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ భారతదేశంలో మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ షేడ్స్‌లో వస్తుంది. ఇది హై-ఎండ్ వాచీల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ డ్యూయల్-రింగ్ డిజైన్‌ను కలిగి ఉంది.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఫిబ్రవరి 15న లాంచ్‌ అవుతోంది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్‌5, హానర్ ఛాయిస్ వాచ్‌లు కూడా అదే రోజున మన దేశంలో అందుబాటులోకి వస్తాయి.

హానర్‌ ఎక్స్‌9బీ 5జీ గత సంవత్సరం మలేషియా, యూఏఈతో సహా ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో ఆవిష్కరించింది. హ్యాండ్‌సెట్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వేరియంట్‌లో కనిపించే 6.78-అంగుళాల 1.5కే (1,200 x 2,652 పిక్సెల్‌లు) అమోల్డ్‌ స్క్రీన్‌, 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 35వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును అందించే అవకాశం ఉంది. 🚀

bottom of page