ధనురాసనం వేసే విధానం:
ఈ ఆసనాన్ని వేసేందుకు.. తొలుత నేలపై బోర్లా పడుకోవాలి. కాళ్లను వెనక్కి వంచి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. తల, ఛాతీ, తొడలను పైకెత్తి పొట్టపై భారం పడేలా చూడాలి. ఇలా 15-20 సెకన్లపాటు ఉండాలి. తర్వాత నెమ్మదిగా ఊపిరి వదులుతా బోర్లా స్థితికి రావాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా 10 సార్లు ధనురాసనాన్ని వేస్తే.. ఎంత కొండలా ఉన్న పొట్టైనా నెలరోజుల్లో కొవ్వొత్తిలా కరిగిపోతుంది. 💪🏃♂️
ధనురాసనం వల్ల కలిగే ప్రయోజనాలు:
మనసు ప్రశాంతంగా ఉంటుంది: ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గి.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. 😌
కొవ్వు కరిగిపోతుంది: పొట్ట దగ్గరి కొవ్వు కరగడంతో పాటు.. అధిక బరువు తగ్గుతుంది.. చక్కని శరీర ఆకృతిని పొందుతారు. పొట్ట దగ్గరి కండరాలు దృఢంగా ఉంటాయి. కండరాలు, ఎముకలు సాగుతాయి. 🏋️♂️
వెన్ను నొప్పి సమస్య ఉండదు: చేతులు, తొడలు గట్టి పడుతాయి. స్త్రీలలో పీసీఓడీ సమస్య తగ్గి, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. వెన్నునొప్పి సమస్య కూడా తగ్గుతుంది. వెన్నెముక దృఢంగా ఉంటుంది. 💆♀️
గ్యాస్ సమస్యలు దూరం: అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఆకలి లేనివారికి ఆకలి పెరుగుతుంది. 🍛🍽️
లోబీపీ మాయం: కడుపు నొప్పి, అల్సర్, మైగ్రేన్, లోబీపీ వంటి సమస్యలున్నవారు ధనురాసనం వేయరాదు. వేయాలనుకుంటే యోగా నిపుణులను సంప్రదించి వేయడం మంచిది. 🩺💊