top of page
Shiva YT

🏛️ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది.

📜 బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేదంటూ రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. 👏

గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. 🔍 దీంతో పట్నానికి పట్టంపై.. సస్పెన్స్ నెలకొంది.. 🌐 ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాండూరు టికెట్‌ను పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 🚀 అదే నియోజకవర్గంలో.. సీనియర్‌ నేతగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డికి భవిష్యత్‌పై అభయం ఇచ్చారు. 🌄 ప్రస్తుత కేబినెట్‌లోకి పట్నంను తీసుకోవాలని నిర్ణయించారు. 👥 ఈ నేపథ్యంలోనే బుధవారం (ఆగస్టు 23) 11.30కి ప్రమాణస్వీకారం ఉంటుందనే వార్తలు వచ్చాయి. 🗞️ పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. 👍 అయితే, రాజ్‌భవన్‌లో అలాంటి వాతావరణం ఏమీ కనిపించలేదు. 🔒 దీంతో రేపు లేదా ఎల్లుండి ఈ ప్రమాణం ఉండొచ్చని తెలుస్తోంది. 📅 గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి సందడి లేకపోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 💬

bottom of page