📱 ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్ల బ్యాటరీ లైఫ్ నాలుగు రోజుల వరకు ఉంటుంది. డెడికేటెడ్ డేటా కనెక్టివిటీ, LED బ్యాటరీ స్థాయి సూచికలు,
తక్కువ బ్యాటరీ స్థాయిల కోసం ఆడియో అలర్ట్‌లు, చివరి లావాదేవీకి అంకితమైన రీప్లే బటన్‌తో పాటు వివిధ భాషల్లో వాయిస్ చెల్లింపు నోటిఫికేషన్లను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యం వల్ల వ్యాపారులకు చెల్లింపు ధృవీకరణ అనుభవాన్ని సులభతరం చేసింది. డిజిటల్ చెల్లింపు సేవలు మరింత పెంచేందుకు ఇవి దోహదపడ్డాయి. అలాగే ఈ స్మార్ట్‌స్పీకర్లు వేగవంతమైన విస్తరణతో సహా ఆఫ్‌లైన్ వ్యాపారలకు వినూత్న పరిష్కారాలను అందించేందుకు ఫోన్ పే నిబద్ధత, ఎంఎస్ఎంఈల డిజిటల్ పరివర్తనలో దాని కీలక పాత్రను చూపిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో ఈ డిజిటల్ చెల్లింపులు మరింతగా విస్తరించనున్నాయి. దేశం డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్లే విషయంలో ఈ డిజిటల్ చెల్లింపులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 📊📈🌐