🏞️ తిరుమల కొండల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా.. 🌄
- Shiva YT
- Aug 18, 2023
- 1 min read
🏞️ శేషాచలం కొండల్లో మొత్తం ఎన్ని చిరుత పులులు, ఎన్ని ఎలుగుబంట్లు ఉన్నాయనేది ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న ప్రశ్నం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. అటవీశాఖ అధికారులు 2016 లెక్కల ప్రకారం శేషాచలం కొండల్లో 36 చిరుతలు, మూడు ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. 2016 నాటి నుంచి నేటి వరకు సంతానోత్పత్తి ద్వారా ప్రస్తుతం చిరుతల సంఖ్య 50 దాటిందని అధికారులు గుర్తించారు.. ఎలుగుబంట్లు కూడా సుమారు 8 ఉన్నట్లు భావిస్తున్నారు.. ఇది భక్తుల్లో ఆందోళన కలిగించే విషయం. మరోవైపు రానున్న రోజుల్లో శేషాచలం కొండల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా, అభయారణ్య చట్టం ప్రకారం వన్యమృగాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతో చేయగలిగిందల్లా వాటిని పరిరక్షిస్తూ, శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించడమే ప్రస్తుతం అధికారుల బాధ్యతగా మారింది. 🌳