top of page
Shiva YT

🇨🇳 చైనా మరో గిచ్చి కయ్యం..

🇨🇳 చైనా తన బుద్ది మరోసారి చూపించింది. చైనా ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 28) అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. 🗺️ దీనిలో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ భూభాగంగా ప్రకటించింది. 🌏

చైనా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 స్థలాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించింది. 🌍 గ్లోబల్ టైమ్స్ అందించిన సమాచారం, కొత్త మ్యాప్‌లో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు, చైనా తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా చైనా భూభాగంలో చేర్చింది. 🌊

🇮🇳 భారత్‌ విషయంలో చైనా మరోసారి తన దమననీతిని ప్రదర్శించింది. తాజాగా విడుదల చేసిన 2023 ప్రామాణిక మ్యాప్‌లో మొత్తం అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం, అక్సాయ్‌ చిన్‌ ప్రాంతమంతా తమ భూభాగమని చైనా ప్రకటించుకుంది. 🌆 ఆగస్టు 28న విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. 🏔️ 1962 యుద్ధంలో ఆక్రమించుకున్న అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమదని చైనా పేర్కొంది. అంతే కాదు తైవాన్‌, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తమ భూభాగమేనని తాజా మ్యాప్‌ ద్వారా చైనా చూపింది. 🗺️ చైనా సర్వేయింగ్‌, మ్యాపింగ్‌ పబ్లిసిటీ డే వేడుకల్లో భాగంగా చైనా ఈ తాజా మ్యాప్‌ విడుదల చేసింది. 🌐 మరో వైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పుడూ తమ భూభాగమేనని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని అనేక సందర్భాల్లో భారత్‌ స్పష్టం చేసింది. 🇮🇳

🗺️ మ్యాప్‌లో, చైనా తొమ్మిది-డ్యాష్ లైన్‌పై తన దావాను సమర్పించింది. 🌄 ఈ విధంగా, అది దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగాన్ని తన ఖాతాలో వేసుకుంది. 🌊 అయితే, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై దావా వేస్తూనే ఉన్నాయి. 🌊


bottom of page