🚗 ఆఫ్టర్ గుంటూరు కారం.. సూపర్ డూపర్ హిట్… మహేష్ మళ్లీ బిజీ అయిపోయారు. జక్కన్న పాన్ వరల్డ్ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో భాగంగా.. స్టంట్స్‌లో .. యాక్షన్‌లో.. ఫారెన్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
రీసెంట్‌గా ట్రెక్కింగ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను కూడా అందరితో పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోల కారణంగానే.. ఆ ఫోటోలో మహేష్ వేసుకున్న జాకెట్ రేట్ కారణంగానే.. అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు మహేష్. డాక్టర్ హ్యారీతో మహేష్ కలిసి ఉన్న ఫోటోలలో సూపర్ స్టార్ బ్రూనెల్లో కుసినెల్లి బ్రాండ్ ధరించాడు. సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న ఆ జాకెట్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ దాని విలువ ఎంతో తెలుసా ?.. అక్షరాల 3.18 లక్షలు. బ్రూనెల్లో కుసినెల్లి అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్. ఇది గొప్ప నాణ్యత గల దుస్తులు, వస్తువులను రూపొందించడంలో ఖ్యాతిని కలిగి ఉంది. 🧥📸