🎉 ఆసియాలో అతి పెద్ద గిరిజన మేడారం జాతర. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో అసలుసిసలు ఘట్టం నేటి నుంచే మొదలుకానుంది.
సమ్మక్క, సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టాలకు ఇవాళే అంకురార్పణ చేయనున్నారు. సాయంత్రం వనదేవత సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది. సారలమ్మ తో పాటు గోవిందరోజు, పగిడిద్దరాజులు వనాన్ని వీడి మేడారం గద్దెవద్దకు చేరుకోనున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాలినడకన వాగులు వంకలు దాటుకుంటూ సాయంత్రానికి మేడారం చేరుకుంటారు.
🌟 ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర మన సాంస్కృతిక వారస్వతానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అని చెప్పారు. అంతేకాదు ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవ వేళ భక్తులకు శుభాకాంక్షలని అన్నారు. ఈ జాతర భక్తి సంప్రదాయం. సమాజ స్ఫూర్తికి గొప్ప కలయిక అని చెప్పారు నరేంద్ర మోడీ. మన వనదేవతలైన సమ్మక్క సారలక్కలకు ప్రణమిద్దాం అని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని పిలుపునిచ్చారు. 🙏