top of page
MediaFx

నా రాజ్‌ను కలవనివ్వండి.. ప్రసాద్ ల్యాబ్ దగ్గర లావణ్య హంగామా..


ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రాజ్ తరుణ్ ను కలవాలంటూ వచ్చిన లావణ్య. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. తన సినిమా తిరగబడరా స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం వచ్చిన రాజ్ తరుణ్. నా రాజ్ తో మాట్లాడనివ్వండి, నా భర్తతో మాల్వీ ఎందుకు ఉంటుంది.. మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది, ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు . నాకు వెతిరేకంగా వస్తే ఈ భూమి మీద ఉండే పరిస్థితి అతనికి ఉండదు అంటూ రచ్చ చేసింది లావణ్య. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్య వ్యవహారంలో నేను లీగల్ గానే పోరాటం చేస్తాను. నేను లావణ్య కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు . నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్ గా వెల్లుతున్నాను. నేను ఆల్రెడీ లీగల్ గానే ముందుకు పోతున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాగే రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. విషయం బయటకి రాగానే నేనే అన్ని మీడియా చానెల్స్ ముందుకు వచ్చాను. నేను క్లారిటీ ఇచ్చాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి లీగల్ గానే ముందుకు పోతాం. నాకు పెళ్లి అంటే చాలా భయం, జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకున్న.. నాతో పాటు శేఖర్ బాషా కూడా చాలా ఆధారాలు బయట పెట్టాడు. నేను పురుషోత్తముడు మూవీకి ప్రమోషన్ కి రాకపోవడానికి కారణం ఉంది. నేను కూడా మనిషినే , నాపై కావాలనే నిందనలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను రాలేక పోయాను అని చెప్పుకొచ్చాడు.

ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా 32 ఏళ్ల జీవితంలో వేలాది మంది తెలిసి ఉన్నారు .. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి. వారం, పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని భాద పడుతున్నాను. నేను చిన్న విషయానికి కూడా చాలా భాద పడుతుంటాను. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా చాలా భాద పడుతున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఎక్కడ బయట పడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటకి రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాలు కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.

bottom of page