🌪️ ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే 2000 మందికి పైగా మరణించారు.
తూర్పు ప్రాంతంలో ఎక్కువ విధ్వంసం సంభవించినట్లు సమాచారం. తుపాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు బురదలో కూలిపోయాయి. డెర్నాలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. చాలా మంది నీటిలో కొట్టుకుపోగా, వేలాది మంది గల్లంతయ్యారు. లిబియాకు సహాయం చేయడానికి టర్కీ ముందుకొచ్చింది. సహాయక బృందాలను.. కావాలిన వస్తు సామగ్రిని నింపిన 3 విమానాలను టర్కీ పంపింది. ప్రధాని ఒసామా హమద్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జెండాలను అర మాస్‌ట్‌లో ఎగురవేయాలని ఆదేశించారు. డేనియల్ తుఫాను సృష్టించిన బీభత్సంతో డెర్నాలో భారీ వినాశనం చోటు చేసుకుందని.. ఇప్పుడు ఈ నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించినట్లు తెలిపారు. లిబియా తూర్పు పార్లమెంటు-మద్దతుగల పరిపాలన అధిపతి ఒసామా హమద్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. కుండపోత వర్షాల కారణంగా లిబియాలో పరిస్థితి భయంకరంగా ఉందని ఒసామా తెలిపారు.
🌊 డేనియల్ తుఫాను విధ్వంసం సృష్టించింది. 🌍 CNN ప్రకారం ఈ వర్షం చాలా బలమైన అల్ప పీడన అవశేషాల ఫలితమని దీనిని అధికారికంగా ఆగ్నేయ ఐరోపాలోని జాతీయ వాతావరణ సంస్థలచే పేరుపెట్టబడి.. స్టార్మ్ డేనియల్ అని పిలుస్తారు. గత వారం తుఫాను మధ్యధరా సముద్రంలోకి పయనించడానికిముందు గ్రీస్‌లో వరదలబీభత్సాన్ని సృష్టించింది. అంతేకాదు మెడికేన్ అని పిలువబడే ఉష్ణమండల తుఫానుగా మారింది. 🌊