ఒక నివేదిక ప్రకారం.. మీరు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ గంటకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో నడవండి.
అమెరికా, జపాన్ బ్రిటన్ వంటి దేశాల నుండి 508,121 మంది పెద్దలు పాల్గొన్న ఒక పరిశోధనలో కొత్త వివరాలు వెల్లడయ్యాయి. వాకింగ్ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. దానితో సంబంధం ఉన్న ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. గంటకు 3-5 కిలోమీటర్ల సగటు నడక వేగం నెమ్మదిగా నడవడం కంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. 🩸🚶♀️💉