top of page
Shiva YT

🌙 అర్థరాత్రి ఉన్నట్లుండి మెలకువా వస్తోందా.? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..

😴 నిద్రపోతున్న సమయంలో ఉన్నపలంగా మెలకువా వచ్చే సందర్భాలు కూడా మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా రాత్రుళ్లు నిద్రలో నాణ్యత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఉన్నపలంగా మెలకువ వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

🌃 సాధారణంగా రాత్రుళ్లు మెలకువ రాగానే ఎవరైనా చేసే పని సమయం ఎంతో తెలుసుకోవడం. అయితే ఎట్టి పరిస్థితుల్లో సమయం చూడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ల్యూమస్‌ టెక్‌ సీఈఓ డాక్టర్ బిక్వాన్‌ లువో మాట్లాడుతూ.. రాత్రి నిద్రలేచిన సమయంలో సమయాన్ని చూస్తే ఒత్తిడి పెరుగుతందని, నిద్రపోవడం కష్టమవుతుందని తెలిపారు. ఒకవేళ సమయాన్ని స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తే.. తెలియకుండానే కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తాం. ఇలా చేయడం వల్ల మళ్లీ నిద్ర పట్టదు.

📱 స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి వెలువడే బ్లూ లైట్‌ కారణంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అర్థరాత్రి మెలకువ వస్తే, వెంటనే మంచంపై నుంచి లేవకూడదని, విశ్రాంతి తీసుకోవాలని, మళ్లీ నిద్రకు ఉపక్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎంతసేపు ప్రయత్నించినా నిద్రరాకపోతే.. కాసేపు పుస్తకం చదవడం లేదా ప్రశాంతతను కలిగించే యోగాను చేయాలని చెబుతున్నారు. ఇక రాత్రుళ్లు నిద్రకు భంగం కలగకుండా ఉండాలంటే పడుకునే ముందు స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 🌿

bottom of page