top of page

🇮🇳 అత్యంత కనిష్ట స్థాయికి భారతదేశ పేదరికం..

🇮🇳 భారతదేశం 2022-23 కి సంబంధించిన అధికారిక వినియోగ వ్యయ డేటాను విడుదల చేసింది. గత పదేళ్లలో భారతదేశానికి మొదటి అధికారిక సర్వే-ఆధారిత పేదరిక అంచనాలను అందించింది. మునుపటి అధికారిక సర్వే 2011-12 నుండి నిర్వహించడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన తాజా డేటా లేకపోవడం వల్ల ప్రపంచ పేదరికం గణన నిష్పత్తులకు గణనీయమైన అనిశ్చితి ఏర్పడింది.

📊 వినియోగ వ్యయాలను అంచనా వేయడానికి భారతదేశం రెండు వేర్వేరు పద్ధతులను ఎంచుకుంది. ఒకటి యూనిఫాం రీకాల్ పీరియడ్ (URP), రెండోవది సవరించిన తర్వాత ఖచ్చితమైన మిశ్రమ రీకాల్ పీరియడ్ (MMRP). URP పద్ధతి 30 రోజుల ఏకరీతి రీకాల్ వ్యవధిలో గృహాల వారి వినియోగ ఖర్చులపై సర్వే నిర్వహించారు. MMRP గత 7 రోజులలో పాడైపోయే వస్తువులు (ఉదాహరణకు, పండ్లు, కూరగాయలు, గుడ్లు) గృహ వినియోగదారుల ఖర్చులు, గత 365 రోజులలో మన్నికైన వస్తువులు, గత 30 రోజులలో అన్ని ఇతర వస్తువులపై ఖర్చులను లెక్క కట్టింది. భారతదేశం అధికారికంగా 2022-23 సర్వేతో ఇతర దేశాలలో ప్రమాణానికంగా MMRPకి మార్చడం జరిగింది. అయితే ఇది గతంలో రెండు పద్ధతులతో ప్రయోగాలు చేసింది. దీంతో భారత దేశంలో గణనీయంగా పేదరికంలో తగ్గుదల నమోదైనట్లు సర్వేలు సూచిస్తున్నాయి.

 
 
bottom of page