top of page
Shiva YT

🇮🇳 దేశంలో 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు..

😴 నిద్రలేమితో బాధపడే సమస్యను స్లీప్‌ డిజార్డర్‌గా పిలుస్తున్నారు. తాజా గణంకాల ప్రకారం భారత్‌లో సుమారు 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ వ్యాధితో బాధపడేవారిలో నిద్రించే సమయంలో శ్వాస ప్రక్రియ సరిగ్గా ఉండదు, గురక వస్తుంది. ఈ కారణాల వల్ల క్వాలిటీ స్లీప్ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

🧔 దేశంలోని పెద్ద వారిలో సుమారు 11 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఏయిమ్స్‌ రెండు దశాబ్ధాల కాలంలో మొత్తం 6 పరిశోధనలు చేసి ఈ డేటాను విడుదల చేసింది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కేసులు పురుషులలో ఎక్కువగా సంభవిస్తున్నాయని పరిశోధనలో తేలింది. దీనివల్ల రాత్రిపూట నిద్ర పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ఈ ప్రభావం ఉదయం చేసే పనులపై పడుతుంది. ఈ నిద్రలేమి మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులకు దారి తీస్తుంది. ఈ విఱాలను జర్నల్‌ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

📊 ఈ పరిశోధన నిర్వహించిన ఎయిమ్స్ న్యూఢిల్లీలోని పల్మోనాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనంత్ మోహన్ మాట్లాడుతూ.. భారతదేశంలో 10 కోట్ల మందికి ఈ స్లీపింగ్ డిజార్డర్ ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. వీరిలో దాదాపు 5 కోట్ల మందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యాధితో పురుషులతో పాటు స్త్రీలలోనూ ఊబకాయం పెరుగుతుంది. ఈ ఈ వ్యాధి కారణంగా మనిషి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. 🌜🛌💤💡🧘‍♂️🚹🚺💊💬📈🏥

bottom of page