top of page
Shiva YT

సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఈ వర్కవుట్స్‌ చేయండి..🌟

ఈత కొట్టడం.. 🏊‍♂️ స్విమ్మింగ్‌ బెస్ట్‌ వర్కవుట్‌ అని చాలా మందికి తెలియదు. కానీ స్విమ్మింగ్‌తో ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోకుండా, బాడీ స్టిఫ్‌గా ఉంచడంలో ఈత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల బరువు తడడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉంటుంది. అందుకే ఇటీవల ఇంట్లోనే స్విమ్మింగ్‌ పూల్స్‌ను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 🏊‍♀️

వెయిట్‌ లిఫ్టింగ్‌.. 🏋️‍♂️ స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండడంలో బరువులెత్తడం (వెయిట్‌ లిఫ్టింగ్‌) కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వ తగ్గిపోయి కండరాలు స్టిఫ్‌గా అవుతాయి. 🏋️‍♀️

యోగా.. 🧘‍♂️ ఇటీవల యోగాను అలవాటు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎంతో మంది సెలబ్రిటీలు కచ్చితంగా యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. రోజులో కనీసం 10 నిమిషాలు యోగ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. 🧘‍♀️

బాక్సింగ్‌.. 🥊 శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో బాక్సింగ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది బాక్సింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బాక్సింగ్‌ను నిత్యం వర్కవుట్స్‌లో భాగం చేసుకుంటున్నారు. బాక్సింగ్‌ చేయడం వల్ల త్వరగా క్యాలరీలు బర్న్‌ కావడంతో పాటు కండరాలను బలంగా మారుతాయి. 🥊

bottom of page