top of page
Shiva YT

💇‍♂️ జుట్టు రాలే సమస్యకు చిట్కాలు..

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. అందులోనూ జుట్టు రాలడం సమస్య సాధారణంగా మారింది. కానీ చిన్న వయసులో జుట్టు రాలడం మంచిది కాదు. ఇది మీ మొత్తం వ్యక్తిత్వాన్ని, రూపాన్ని పాడు చేస్తుంది.

జుట్టు రాలడం సమస్యకు సకాలంలో చికిత్స చేయడం మంచిది. నైపుణ్యం కలిగిన హెయిర్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. మీ జుట్టు రాలడం సమస్య గురించి చెప్పండి. అలాగే, మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. చాలా సార్లు, మురికిగా ఉన్న స్కాల్ప్ కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టుకు నూనె వేయకపోవడం, షాంపూ చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం, శరీరంలో పోషకాలు లేకపోవడం వంటివి దీనికి కారణం.

🌿 జుట్టుకు తగినన్ని పోషకాలను అందించడానికి హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే, ఇందుకోసం కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె ఉపయోగిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. ఈ నూనెలను జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ నూనెలు రాసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుంటే ఇంట్లోనే కొన్ని నూనెలు సిద్ధం చేసుకుని నెలకో, రెండు నెలలకో రాసుకోవచ్చు. ఈ నూనెలన్నీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి కాబట్టి జుట్టుకు పెద్దగా నష్టం వాటిల్లదు. సహజ నూనెలు జుట్టు రాలడాన్ని ఆపుతాయి. ఈ రోజు మనం కొన్ని హెయిర్ ఆయిల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాంం. వాటిని అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు పరిష్కరించుకోవచ్చు. 💆‍♀️

bottom of page