top of page
Shiva YT

🌙 రాత్రి నిద్రకు ముందు ముఖానికి ఈ లోషన్‌ అప్లై చేసి చూడండి! 🌙

❄️ శీతాకాలం క్రమంగా కనుమరుగవుతోంది. వెచ్చని గాలులు అప్పుడే ప్రారంభమయ్యాయి. చలికాలం ముగిసిపోతున్నట్లు భావించి చాలా మంది ఈ సమయంలో తమ చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. ఇది అకాల వృద్ధాప్య సంకేతాలకు దారితీస్తుంది.


🌺 గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని నిర్జలీకరణం నుంచి రక్షించడానికి, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి మ్యాజిక్‌లా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్లైకోలిక్ యాసిడ్ ముఖ్యంగా చర్మ కణాలను పునరుద్ధరించడంలో, చర్మ కాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

🌟 గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ రకానికి చెందిన సేంద్రీయ ఆమ్లాల సమ్మేళనం. ఇది చెరకుతో సహా వివిధ పండ్లు, పాలలో సహజంగా తయారు చేస్తారు. అంతేకాకుండా మార్కెట్‌లో కూడా గ్లైకోలిక్ యాసిడ్‌తో కూడిన వివిధ కాస్మెటిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన సౌందర్య సాధనాలను ఉపయోగించాలి. 🌸 గ్లైకోలిక్ యాసిడ్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మానికి ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మం స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడం, ముడతలను తగ్గించడం, చర్మ ప్రకాశాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

🌿 గ్లైకోలిక్ యాసిడ్ అనేది హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించే ఔషధం. ముఖంపై నల్లటి మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు, మొటిమలను తగ్గించేందుకు గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన సౌందర్య సాధనాలను ఉపయోగించాలి. గ్లైకోలిక్ యాసిడ్ దురద, చికాకు, దద్దుర్లు తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సున్నితమైన చర్మానికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే ఎండలోకి వెళ్ళే ముందు గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయడం వల్ల ట్యాన్ తగ్గుతుంది.

🌛 ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన కాస్మోటిక్స్‌ ముఖాన్ని అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అయితే, గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన ఉత్పత్తులను మొదటిసారిగా ఉపయోగించేవారు తేలికపాటి క్రీమ్‌తో ప్రారంభించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 🌿

bottom of page