మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ మాసంలో ముస్లిం ఉపవాస దీక్ష చేసి జరుపుకుంటున్నారు. మత సామరస్యానికి, సర్వమానవ సమానత్వానికి, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ మాసంలో దానధర్మాలు చేసి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.
పవిత్రమైన రంజాన్‌మాసంలో హైదరాబాద్‌లోని నగరంలో ఏ గల్లీ చూసినా హలీమ్ బట్టీలు దర్శనమిస్తున్నాయి. హలీమ్ తయారీకి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువత వస్తున్నారు. చికెన్, మటన్‌తోనే కాకుండానే అనేక వెరైటీ హమీలనూ తయారు చేస్తున్నారు. బాదమీ, వెజ్, జాఫ్రానీ, హరీస్ లాంటి వెరైటీ హలీమ్‌లు మరింత ఆకట్టుకుంటున్నాయి. రంజాన్ మాసంలో మాత్రమో లభించే వెరైటీ హలీమ్‌ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ హోటల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 999 రూపాయలకే 50 రకాలతో కూడిన వంటకాలను సెహరీలో అందుబాటులో ఉంచారు. అతి తక్కువ ధరకే ఇన్ని ఐటమ్స్ ఇస్తుండటంతో ఈ ఆఫర్‌కు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా సెహరీ సమయంలో ఫుడ్ తినడానికి తరలివస్తున్నారు. ఈ హోటల్‌కు సామాన్య ప్రజలతో పాటు రాత్రి వేళల్లో విధులు నిర్వహించుకుని వెళ్తున్న ఐటీ ఉద్యోగులు కూడా ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. అంతే కాదు హైదరాబాద్‌లో ఈ సెహరీ బఫ్‌ను మొదట పరిచయం చేసింది ఈ హోటలే. దీంతో ఫుడ్ వెరైటీలతోపాటు తక్కువ ధరకే దొరుకుతుండటంతో భోజనప్రియులు బారులు తీరుతున్నారు.