top of page
MediaFx

పర్యాటకుల కోసం ఈ-వీసాను ప్రారంభించిన జపాన్..

పర్యాటకులను ఆకర్షించడానికి జపాన్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తమ దేశంలోకి రావాలనుకునే పర్యాటకుల కోసం భారత్‌తో పాటు అనేక దేశాలకు ఈ–వీసా దరఖాస్తును ప్రారంభించింది. సాధారణ పాస్‌పోర్టును కలిగి ఉండి జపాన్‌లో స్వల్పకాలికంగా పర్యటించాలనుకునే వారికోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. సింగిల్-ఎంట్రీ వీసా గరిష్టంగా 90 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.



bottom of page