top of page
Shiva YT

🌴🌟 కేరళలోని ‘మ్యాజిక్‌’ను చూసొద్దాం రండి..

🌟 ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అద్భుతమైన ప్యాకేజీని ప్రవేశపెట్టింది. మ్యాజిక్‌ ఆఫ్‌ మలబార్‌ పేరిట తీసుకొచ్చిన ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలో తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది. 🌙💼

🛫 డే1(హైదరాబాద్ నుంచి కన్నూర్): ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి కన్నూర్ చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో అల్పాహారం తరువాత ఏంజెలో ఫోర్ట్‌, అరక్కల్ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం ఎజిమల వ్యూ పాయింట్‌ని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసిన కన్నూర్‌లోనే బస చేస్తారు. 🚌🌆

🚍 డే 2(కన్నూర్ – వాయనాడ్): హోటల్‌లో అల్పాహారం చేశాక వాయనాడ్ బయలుదేరుతారు. అక్కడ బాణాసుర సాగర్ డ్యామ్, అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం సందర్శిస్తారు. అనంతరం రాత్రి భోజనం చేసి వయనాడ్‌లోనే రాత్రి బస చేస్తారు. 🌄🍽️

🌳 డే 3(వాయనాడ్): హోటల్‌లో అల్పాహారం చేశాక కురువా ద్వీపం, తిరునెల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. హోటల్‌కి తిరిగి వెళ్లి రాత్రికి వయనాడ్‌లోనే బస చేస్తారు. 🏝️🏞️

🌲 డే 4(వాయనాడ్ – కోజిక్కోడ్ – గురువాయూర్): హోటల్‌లో అల్పాహారం చేశాక పూకోడ్ సరస్సు, లక్కిడి వ్యూ పాయింట్‌ని సందర్శిస్తారు. అనంతరం కోజికోడ్‌కు బయలుదేరుతారు. అక్కడ బేపూర్ బీచ్ సందర్శించి. సాయంత్రం గురువాయూర్‌కు బయలుదేరుతారు. అనంతరం హోటల్‌లో రాత్రి భోజనం చేసి అక్కడే బస చేస్తారు. 🌊🚌

🌅 డే 5(గురువాయూర్): హోటల్‌లో అల్పాహారం చేశాక గురువాయూర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం మెరైన్ వరల్డ్ అక్వేరియంను సందర్శించండి. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకొని భోజనం చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు. 🏖️🍽️


bottom of page